ముగిసిన రతన్ టాటా అంత్యక్రియలు
టాటా సన్స్ అధినేత రతన్ టాటా(Ratan Tata) అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి.
దిశ, వెబ్ డెస్క్ : టాటా సన్స్ అధినేత రతన్ టాటా(Ratan Tata) అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. గురువారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు టాటా పార్థివదేహాన్ని ఎన్సీపీఏ గ్రౌండ్స్ లో ప్రజల సందర్శన కోసం ఉంచారు. అనంతరం సాయంత్రం వరకు జరిగిన టాటా అంతిమాయాత్రలో వేలాదిగా అభిమానులు, ప్రముఖులు పాల్గొన్నారు. వర్లీ శ్మశానవాటికలో రతన్ టాటా పార్థివదేహానికి మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. టాటా అంత్యక్రియాల కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. రతన్ టాటా పార్శీ మతస్తుడు అయినప్పటికీ హిందూ మతంలో మాదిరిగా దహన సంస్కారాలను ఎలక్ట్రిక్ విధానంలో నిర్వహించారు.