సినిమా రంగాన్ని కూడా టచ్ చేసిన రతన్ టాటా.. ఆ దిగ్గజ నటుడితో మూవీ

ప్రారిశ్రామిక రంగంలో చెరగని ముద్ర వేసిన రతన్ టాటా(Ratan Tata) ఒకానొక సమయంలో సినీ రంగాన్ని కూడా పలకరించారు.

Update: 2024-10-10 15:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రారిశ్రామిక రంగంలో చెరగని ముద్ర వేసిన రతన్ టాటా(Ratan Tata) ఒకానొక సమయంలో సినీ రంగాన్ని కూడా పలకరించారు. భారత దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) హీరోగా నటించిన ఏత్బార్(Aetbaar) చిత్రానికి రతన్ టాటా కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. 2004లో వచ్చిన ఈ చిత్రంలో బిపాస బసు హీరోయిన్‌గా, జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించారు. రొమాంటిక్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విక్రమ్‌ భట్‌ దర్శకత్వం వహించారు. రతన్ టాటా నిర్మించిన మొదటి చిత్రం, ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం.

హాలీవుడ్‌ చిత్రం ఫియర్‌ ఆధారంగా ఏత్‌బార్‌ తెరకెక్కించారు. కాగా, రతన్ టాటా(86) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భారతీయ వ్యాపార విలువలకు ప్రతిబింబంగా నిలిచిన రతన్ టాటా దాతగా కూడా ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు. అయితే, రతన్ టాటాకు సినీరంగంతో కూడా సంబంధం ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ విషయం మరణం తర్వాత వెలుగులోకి రావడంతో సోషల్ మీడియా వేదికగా ఆయన ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.



 



Similar News