Barack Obama: అమెరికా కొత్త అధ్యయనానికి సిద్ధంగా ఉంది

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పై ప్రశంసలు కురిపించారు. అమెరికా కొత్త అధ్యయనానికి సిద్ధంగా ఉందన్నారు.

Update: 2024-08-21 06:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పై ప్రశంసలు కురిపించారు. అమెరికా కొత్త అధ్యయనానికి సిద్ధంగా ఉందన్నారు. కమలా హారిస్‌ (Kamala Harris) కోసం అమెరికా రెడీగా ఉందన్నారు. అధ్యక్ష విధులు నిర్వర్తించడానికి కమలా హ్యారిస్ కూడా సన్నద్ధమయ్యారని ఆమెకు ఒబామా మద్దతు పలికారు. చికాగోలో జరుగుతున్న డెమొక్రటిక్‌ పార్టీ నేషనల్ కన్వెన్షన్ లో ఒబామా, ఆయన సతీమణి ప్రసంగించారు. కమలా హ్యారిస్ కు తమ మద్దతుని ప్రకటించారు. ‘‘ఈ కొత్త ఆర్థికవ్యవస్థలో కోట్లాదిమంది ప్రజల అవసరాలను గుర్తించే నాయకుడు కావాలి. కమలా ఇవన్నీ అవసరాలు తీర్చే అధ్యక్షురాలిగా ఉంటారు. అవును, ఆమె ఇవన్నీ చేయగలరు. ఈ అధ్యక్ష ఎన్నికల పోరు హోరాహోరీగా ఉండనుంది. గతంలో నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు.. గృహ తనఖా సంక్షోభం తర్వాత ఇంటి యజమానులకు న్యాయమైన పరిష్కారం లభించేలా చూసేందుకు మా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడే వారికి వ్యతిరేకంగా ఫైట్ చేశారు. కమలా మీ సమస్యలపై దృష్టి పెడతారు, సొంత ఓటర్ల గురించి మాత్రమే కాకుండా.. తనను వ్యతిరేకించే వారి సమస్యలు కూడా తీర్చుతారు.” అని ఒబామా కమలా హ్యారిస్ ని కొనియాడారు.

హ్యారిస్ పై మిషెల్ ఒబామా ప్రశంసలు

అలాగే ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్ వాల్జ్‌ పై ఒబామా ప్రశంసలు కురిపించారు. " ఆయన రాజకీయాల్లో ఉండవలసిన వ్యక్తి. ఒక చిన్న పట్టణంలో పుట్టి తన దేశానికి సేవ చేసిన గొప్ప మనిషి." అని కొనియాడారు. ఒబామా ప్రసంగం డెమొక్రాట్లలో జోష్ నింపింది. కమలా హ్యారిస్ గురించి మిషెల్ ఒబామా మాట్లాడుతూ.. ‘కమల, నేను ఒకే విలువలపై మా జీవితాలను నిర్మించుకున్నాం. హ్యారిస్ తల్లి తన బిడ్డకు న్యాయం గురించి నేర్పారు. కూర్చోని కంప్లైంట్స్ చేయొద్దు. ఏదైనా చేయాలని సూచించారు. ఆ మాటలతోనే హ్యారిస్‌ మెరుగైన జీవితాల కోసం పోరాడారు.’ అని మిషెల్ ప్రశంసించారు. కమలా తన సొంత సమస్యల గురించి కాకుండా ప్రజల ఆందోళనలపై దృష్టిసారిస్తారని చెప్పారు.


Similar News