యుద్ధాలు గెలవాలంటే.. రక్షణ వనరుల వినియోగం పెంచాలి : చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్
ఆర్మీని బలోపేతం చేయాలన్నా, యుద్ధాల్లో గెలవాలన్నా టెక్నాలజీ, సప్లయ్ చైన్, జాతీయ నిల్వలు వంటి రక్షణ వనరుల వినియోగాన్ని చైనా మరింత మెరుగు పర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తెలిపారు.
బీజింగ్: ఆర్మీని బలోపేతం చేయాలన్నా, యుద్ధాల్లో గెలవాలన్నా టెక్నాలజీ, సప్లయ్ చైన్, జాతీయ నిల్వలు వంటి రక్షణ వనరుల వినియోగాన్ని చైనా మరింత మెరుగు పర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తెలిపారు. పార్లమెంటు వార్షిక సెషన్ సందర్భంగా మిలిటరీ పోలీసులు, ఆర్మీ ప్రతినిధులను ఉద్దేశించి జిన్‌పింగ్ మాట్లాడారు. రక్షణ రంగంలో సైన్స్, టెక్నాలజీ వాడకం పెరగాలని సూచించారు.
అప్పుడే సైన్యం మరింత బలోపేతమై, యుద్ధాల్లో గెలవగలుగుతుందని చెప్పారు. విదేశాలపై ఆధారపడకుండా రక్షణ సాంకేతికతలో పరిశోధనలను వేగవంతం చేయాలని చైనా ప్రయోగశాలలను కోరారు. కాగా, అటు తైవాన్, చైనాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం, ఇటు భారత్‌తో సరిహద్దు వివాదాల కొనసాగుతున్న వేళ జిన్‌పింగ్ తాజా ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి.