Bengaluru: బెంగళూరు వ్యాపారి హత్య కేసులో ట్విస్ట్
బెంగళూరులో రియల్ ఎస్టేస్ వ్యాపారి లోకనాథ్ సింగ్ (37) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడ్ని తన భార్య తల్లి (అత్త) స్వయంగా లోకనాథ్ ని హత్య చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరులో రియల్ ఎస్టేస్ వ్యాపారి లోకనాథ్ సింగ్ (37) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడ్ని తన భార్య తల్లి (అత్త) స్వయంగా లోకనాథ్ ని హత్య చేసింది. అత్త, భార్య కలిసే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడ్ని వివాహేత సంబంధాలు, అక్రమ వ్యాపార లావాదేవీల వల్ల చంపినట్లు వెల్లడించారు. చిక్కబనవరలోని నిర్జన ప్రాంతంలో శనివారం కారులో లోక్‌నాథ్ సింగ్ మృతదేహాన్ని గుర్తించారు. కాగా.. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. భార్య, అత్తను నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో వారిద్దరిని అరెస్టు చేసినట్లు నార్త్ బెంగళూరు డీసీపీ సైదుల్ అదావత్ తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో నిందితులు లోక్ నాథ్ కి నిద్రమాత్రలు కలిపిన ఆహారం పెట్టినట్లు తేలిందన్నారు. ఆ తర్వాత అతడ్ని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో గొంతుకోసి పారిపోయాలని చెప్పారు. మృతుడి వివాహేతర సంబంధాలు, అక్రమ వ్యాపార లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు.
గతేడాది పెళ్లి
పెళ్లికి ముందే లోక్‌నాథ్ రెండేళ్లుగా తన భార్యతో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. గతేడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య వయస్సు అంతరం కారణంగా అతని కుటుంబం ఈ సంబంధాన్ని వ్యతిరేకించింది. అయితే, వివాహం జరిగిన వెంటనే ఏమీ తెలియనట్లు లోక్‌నాథ్ తన భార్యను ఆమె తల్లిదండ్రుల ఇంట్లో వదిలి వెళ్ళాడు. రెండు వారాల క్రితం వరకు ఆ మహిళ కుటుంబానికి ఆమె వివాహం గురించి తెలిసింది. అంతేకాకుండా, ఈ సమయంలోనే లోక్‌నాథ్ భార్య, అత్తమామలు అతని వివాహేతర సంబంధాలు, అక్రమ వ్యాపార లావాదేవీల గురించి తెలుసుకున్నారని పోలీసులు తెలిపారు. అయితే, గొడవల వల్ల లోకనాథ్, అతడి భార్య విడాకులు తీసుకుందామనుకున్నట్లు తెలిపారు. కానీ, భార్య కుటుంబసభ్యులను బెదిరించడంతో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో, ప్లాన్ ప్రకారం అత్త, భార్య అతడ్ని హత్య చేశారు. మరోవైపు, ఒక మోసం కేసులో లోక్‌నాథ్ ని బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేసినట్లు అధికారులు తెలిపారు.