Karnataka Wife Maintenance : భర్త నుంచి రూ.6 లక్షల భరణం కోరిన భార్య.. ఆమె సంపాదించుకోవాలన్న జడ్జి

భారత్‌లో సాధారణంగా భర్త నుంచి వీడాకులు తీసుకున్న మహిళలు అర్థిక సాయంగా భరణం పొందవచ్చు.

Update: 2024-08-22 06:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్‌లో సాధారణంగా భర్త నుంచి వీడాకులు తీసుకున్న మహిళలు అర్థిక సాయంగా భరణం పొందవచ్చు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ మహిళ తన భర్త నుంచి భరణం కావాలని కోర్టును ఆశ్రయించింది. ఆమె కోరికలు వీని జడ్జి, నెటిజన్లు అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. కర్ణాటకలో భర్త నుంచి విడిపోయిన ఓ మహిళ తనకు భరణంగా ప్రతి నెలా రూ 6.16,300 ఇప్పించాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. షూలు, దుస్తులు, గాజులు నెలకు రూ. 15 వేలు, ఇల్లు, తిండికి రూ. 60 వేలు.. మోకాళ్ళ నొప్పులు, ఫిజియోథెరపీ, ఇతర మందులకు రూ. 4-5 లక్షలు కావాలని కోరింది. దీంతో హైకోర్టు జడ్జి జస్టిస్ లలిత ఆగ్రహించింది.

దయచేసి ఒక వ్యక్తికి కాలవాల్సింది ఇంతేనని కోర్టుకు చెప్పకండి, నెలకు రూ.6 లక్షలకు పైగా ఎవరైనా ఖర్చు చేస్తారా? అది ఒక ఒంటరి మహిళ అంటూ సీరియస్ అయ్యారు. మీకు కుటుంబ బాధ్యతలు ఏవీ లేవు.. మీరు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం లేదు.. ఇంత ఖర్చు చేయాలనుకుంటే ఆమెనే సంపాదించుకోమనండి.. ఆమె అడిగినంత భరణం ఇప్పించడం చట్టం కాదు అని జడ్జి ఆగ్రహించారు. సహేతుకమైన మొత్తాన్ని డిమాండ్ చేయండి.. లేదంటే పిటిషన్ తిరస్కరిస్తామని జడ్జి సూచించారు.

ఆగస్టు 20న జరిగిన విచారణలో రాధా మునుకుంట్ల అనే మహిళ తన ఖర్చుల వివరాలను కోర్టుకు సమర్పించారు. అయితే, ఆమె భర్త ఎం నరసింహ నుంచి నెలవారీ మెయింటెనెన్స్ రూ. 50 వేలు పొందాలని సెప్టెంబర్‌లో బెంగళూరు ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. దీంతో సదరు మహిళ భరణం పెంచాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించడంతో చుక్కెదురైంది.

Tags:    

Similar News