భారత్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధం: చైనా ప్రధాని

నరేంద్ర మోడీ మూడోసారి భారత ప్రధాని ఎన్నికైనందుకు అభినందనలు తెలిపే సందర్భంలో ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-06-11 16:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: 'ద్వైపాక్షిక సంబంధాలను సరైన దిశలో ముందుకు తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేద్నుకు సిద్ధంగా ఉన్నామని చైనా ప్రధాని లీ కియాంగ్ మంగళవారం అన్నారు. నరేంద్ర మోడీ మూడోసారి భారత ప్రధాని ఎన్నికైనందుకు అభినందనలు తెలిపే సందర్భంలో ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు. చైనా-భారత్ సంబంధాల పటిష్టమైన, స్థిరమైన అభివృద్ధి ద్వారా ఇరు దేశాలకు మాత్రమే కాకుండా, ప్రపంచానికి స్థిరమైన, సానుకూల శక్తిని అందిస్తుందని లీ కియాంగ్ అభిప్రాయపడ్డారు. కాబట్టి దానికోసం భారత్‌తో కలిసి పనిచేసేందుకు సానుకూలంగా ఉన్నామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయానికి చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ జూన్ 5నే ప్రధాని మోడీని అభినందించింది. అలాగే, నాలుగేళ్ల క్రితం గాల్వాన్ ఘటనతో స్తంభించిన ద్వైపాక్షిక సంబధాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు ఆలోచించాలని అభిప్రాయపడింది. 2020, మే 5న గాల్వాన్ సమీపంలోని పాంగ్‌కాక్ త్సో(సరస్సు) ప్రాంతంలో హింసాత్మక ఘర్షణ తర్వాత తూర్పు లద్దాఖ్ సరిహద్దు దెబ్బతినడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు(వాణిజ్యం మినహా) క్షీణించాయి. 


Similar News