Coast Guard : ఇండియన్ కోస్ట్ గార్డ్‌లోకి రెండు స్వదేశీ నౌకలు.. ప్రాధాన్యతలివే?

ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం గోవా షియ్ యార్డ్ లిమిటెడ్ రూపొందించిన అదమ్య అక్షర్ అనే రెండు స్వదేశీ నౌకలను ప్రారంభించారు.

Update: 2024-10-28 12:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian coast Guard) కోసం గోవా షియ్ యార్డ్ లిమిటెడ్ (Gsl) రూపొందించిన ‘అదమ్య’ (Adamya), ‘అక్షర్’ (Akshar) అనే రెండు స్వదేశీ నౌకలను సోమవారం ప్రారంభించారు. వీటిని ఆఫ్‌షోర్ ఆస్తులు, ద్వీప ప్రాంతాల భద్రత, నిఘా కార్యకలాపాల కోసం ఉపయోగించనున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ పరమేష్ శివమణి (Paramesh shivamani), ఆయన భార్య ప్రియా పరమేష్‌ (priya paramesh)లు ఈ రెండు నౌకలను లాంచ్ చేశారు. 52 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు ఉండే ఈ నౌకలు అఫ్ షోర్ ఆస్తులు, ద్వీప భూభాగాల్లో భద్రతకు ఉపయోగపడతాయి.

ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం జీఎస్ఎల్ రూ.473 కోట్ల వ్యయంలో 8 ఫాస్ట్ పెట్రోల్ నౌకలను నిర్మిస్తోంది. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో జీఎస్ఎల్ కీలక పాత్ర పోషిస్తుందనడానికి ఇదే నిదర్శనమని చెబుతున్నారు. అనంతరం డీజీ పరమేశ్ మాట్లాడుతూ..ఈ ప్రాజెక్ట్ భారత తయారీ వ్యవస్థను బలపరుస్తుందని, ఉత్పత్తిలో నిమగ్నమైన ఎంఎస్ఎంఈలకు గణనీయమైన ఉపాధి అవకాశాలను కలిగిస్తుందని తెలిపారు. ఈ నౌకల్లోని స్వదేశీ కంటెంట్ ఆత్మనిర్భర్ భారత్ చొరవకు గర్వకారణమని కొనియాడారు. 

Tags:    

Similar News