BCI: ఢిల్లీలో 107 మంది 'నకిలీ' లాయర్లను తొలగించిన బార్ కౌన్సిల్

న్యాయవ్యవస్థలో సమగ్రత, వృత్తి నిబద్ధతను కొనసాగించడానికి జరుగుతున్న డ్రైవ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

Update: 2024-10-28 12:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఢిల్లీలో 2019 నుంచి 2024, అక్టోబర్ మధ్య 107 మంది నకిలీ లాయర్ల తొలగించింది. న్యాయవ్యవస్థలో సమగ్రత, వృత్తి నిబద్ధతను కొనసాగించడానికి జరుగుతున్న డ్రైవ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. 'ఈ చర్యతో నకిలీ లాయర్లను, చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా లేని వారిని తొలగించడం వీలవుతుంది. అలా చేయడం ద్వారా, బీసీఐ ప్రజల విశ్వాసాన్ని, న్యాయ వ్యవస్థను అనైతిక పద్ధతుల నుంచి రక్షించడానికి సాధ్యమవుతుందని' బీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. న్యాయవాద సంఘం సమగ్రత, వృత్తి నిబద్ధతను కాపాడుకోవడంలో భాగంగా నకిలీ న్యాయవాదుల పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు బీసీఐ కార్యదర్శి శ్రీమంతో సేన్ తెలిపారు. 2019- 2023, జూన్ 23 మధ్య కూడా వేల మంది నకిలీ న్యాయవాదులు వారి ఆధారాలు, ప్రాక్టీస్‌లపై సమగ్ర విచారణ తర్వాత తొలగించబడ్డారు. ఈ తొలగింపులు ఎక్కువగా నకిలీ సర్టిఫికేట్‌ల సమస్యలు, ఎన్‌రోల్ సమయంలో తప్పుగా సూచించడం వల్ల జరిగాయి. అంతేకాకుండా, సరైన ప్రాక్టీస్ చేయకపోవడం, బార్ కౌన్సిల్ వెరిఫికేషన్ ప్రక్రియను పాటించకపోవడం వంటి కారణాలతో తొలగించినట్టు బీసీఐ తన ప్రకటనలో పేర్కొంది. 

Tags:    

Similar News