Good News : భారత పర్యాటకులకు రష్యా గుడ్ న్యూస్!

భారత పర్యాటకులకు రష్యా(Russia) శుభవార్త అందించనుంది.

Update: 2024-10-28 12:28 GMT

దిశ, వెబ్ డెస్క్ : భారత పర్యాటకులకు రష్యా(Russia) శుభవార్త అందించనుంది. త్వరలోనే ఇండియన్ టూరిస్టులకు వీసా లేకుండానే పర్యటనలకు అనుమతులు ఇవ్వనున్నట్టు సమాచారం. 2025 స్ప్రింగ్ సీజన్ నుండి ఈ అవకాశం అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు రష్యాకు చెందిన అధికారులు పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో టూరిజం విషయంలో రష్యాకు భారత్ కీలక మార్కెట్ గా అవతరించింది. ఒక్క మాస్కో(Mascow)లోనే ఈ ఏడాదిలోని జూన్ వరకు 30 వేల మంది కంటే ఎక్కువ పర్యాటకులు సందర్శించారు. గతేడాది కనయె ఇది రెండు రేట్లు ఎక్కువని మాస్కో టూరిజం అధికారులు తెలిపారు. కాగా గతేడాది అత్యధిక రష్యా వీసాలు పొందిన తొలి ఐదు దేశాల్లో భారత్ కూడా ఒకటని.. దాదాపు 10 వేల వీసాలు భారత పర్యాటకులకు జారీ చేశామని అధికారులు పేర్కొన్నారు. 'వాణిజ్య టూరిజం'(Travel Business)కు మాస్కో కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో భారత పర్యాటకులకు ఉచిత వీసాలు జారీ చేయాలని రష్యా నిర్ణయించింది.    

Tags:    

Similar News