చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంటా: ఢిల్లీ చీఫ్ కౌంటర్

తన చివరి శ్వాస వరకు పోరాడుతానని పేర్కొంటూ శనివారం ట్వీట్ చేశారు

Update: 2023-01-21 09:29 GMT

న్యూఢిల్లీ: సంచలనంగా మారిన ఢిల్లీ మహిళ కమిషన్ చీఫ్ స్వాలి మలివాల్‌పై వేధింపులు డ్రామా అని పేర్కొన్న బీజేపీ నేతల విమర్శలను ఆమె తిప్పికొట్టారు. బీజేపీవే అబద్దాల చెబుతుందని విమర్శించారు. తన చివరి శ్వాస వరకు పోరాడుతానని పేర్కొంటూ శనివారం ట్వీట్ చేశారు. 'నా గురించి బూటకపు అబద్ధాలు చెప్పి నన్ను భయపెడతారని భావించే వారిని అలాగే చేయనివ్వండి. ఈ చిన్న జీవితంలో ఎన్నో పెద్ద పనులు చేశాను. నాపై చాలాసార్లు దాడి జరిగినా ఆగలేదు. ప్రతి అఘాయిత్యానికి నాలో కసి మరింత బలపడింది. నా గొంతును ఎవరూ అణచలేరు. నేను జీవించి ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాను' అని ట్వీట్ చేశారు. అయితే గురువారం ఉదయం కారు డ్రైవర్ స్వాతి మాలివల్‌పై వేధింపులకు ప్రయత్నించాడనే ఆరోపణలపై బీజేపీ సందేహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసులను తప్పు పట్టించేందుకు చేసిన చర్యగా ఆరోపించారు. దీనిని ఆమె ఖండించారు. కాగా, గురువారమే కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి : మోడల్‌ను వేధించిన నటుడు, కర్ణిసేన లీడర్ అరెస్ట్.. ప్రపోజ్ చేస్తే తిరస్కరించిందనేనా?

Tags:    

Similar News