ఒడిశా రైలు ప్రమాదాన్ని ‘కవచ్’ టెక్నాలజీ ఎందుకు ఆపలేకపోయింది..?

ఒడిశాలో చోటు చేసుకున్న రైల్వే ప్రమాదంలో మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతోంది.

Update: 2023-06-03 06:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశాలో చోటు చేసుకున్న రైల్వే ప్రమాదంలో మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. మృతుల సంఖ్య 300కు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే ఈ ప్రమాదానికి గల కారణాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రైల్వే ప్రమాదాలను నివారించేందుకు భారతీయ రైల్వే శాఖ ప్రవేశపెట్టిన కవచ్ టెక్నాలజీ విఫలమైందా? తాజా ప్రమాదం అనంతరం ఇంటర్నెట్‌లో నెటిజన్లు ఈ టెక్నాలజీపై ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఒడిశా ప్రమాదాన్ని కవచ్ యాంటీ కొలిజన్ సాంకేతికత ఎందుకు ఆపలేకపోయిందని రైల్వేశాఖ మంత్రిని ట్విట్టర్ లో నిలదీస్తున్నాయి.

కవచ్ టెక్నాలజీ అంటే ఏమిటి?

కవచ్ అనేది రైలు ప్రమాదాలను నివారించేందుకు పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన సరికొత్త వ్యవస్థ. దేశంలో తొలిసారిగా తెలంగాణలో వికారాబాద్ జిల్లాలో కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఈ టెక్నాలజీని స్వయంగా గతేడాది మార్చిలో పరీక్షించారు. ఈ టెక్నాలజీ ద్వారా ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు ఎదురెదురుగా దూసుకువచ్చినా ప్రమాదం జరగకుండా ఈ టెక్నాలజీ ఆపుతుంది. రెడ్ సిగ్నల్ పట్టించుకోకుండా లోకో పైలట్ రైలును ముందుకు తీసుకెళ్తుంటే కవచ్ వ్యవస్థతో ఆటోమెటిగ్ గా బ్రేకులు పడతాయి. ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, ఎదురెదురుగా రైళ్లు వస్తున్నప్పుడు కూడా వెంటనే లోపాన్ని గుర్తించి రైలును ఆపుతుంది. ఈ టెక్నాలజీతో పదివేల ఏళ్లలో ఒకసారి మాత్రమే తప్పిదం జరగవచ్చని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ గతంలో చెప్పారు.

ఒడిశా ప్రమాదంలో కవచ్‌కు సంబంధం లేదా?

ఒడిశా బాలేశ్వర్‌లో జరిగిన ఘటనకు స్పష్టమైన కారణం రైల్వేశాఖ ఇప్పటికి వెళ్లడించలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం పట్టాలు తప్పిన గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీ కొట్టింది. దాంతో ఈ రైలు కోచ్‌లు పక్క ట్రాక్‌పై పడ్డాయి. కొద్దిసేపటికే ఆ రెండో ట్రాక్ మీదుగా వెళ్తున్న బెంగళూరు-హౌరా ఎక్స్ ప్రెస్ రైలు ట్రాక్‌పై పడి ఉన్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ కోచ్‌లను ఢీ కొట్టింది. అయితే కవచ్ అనే టెక్నాలజీ రెండు రైలు ఇంజన్ లు ఎదురెదురుగా వస్తున్న సందర్భంలో ఢీ కొట్టకుండా ఉండేందుకు తయారు చేయబడింది.

అందువల్ల వెనుక నుండి జరిగిన ఈ ప్రమాదాన్ని కవచ్ ఆపలేకపోయిందనేది ఇంటర్నెట్‌లో వినిపిస్తున్న ఓ వాదన. మరో వాదన ప్రకారం ఈ సాంకేతికత అన్ని నెట్ వర్క్‌లలో ఇన్ స్టాల్ చేయడబలేదని ప్రస్తుతం ప్రమాదానికి గురైన నెట్ వర్క్‌లో ఈ సాంకేతికత లేదనేది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటనేది మాత్రం నిపుణుల కమిటీ నివేదిక వెలువడిన తర్వాతే తెలియనుంది.

Also Read:   Coromandel express accident.. అంతా 20 నిమిషాల్లోనే.. 

Coromandel express accident :కోరమండల్ రైలు ప్రమాదం ఎలా జరిగిందంటే..?

Tags:    

Similar News