ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?
భారత దేశంలో ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే ఈ కాలం పిల్లలకు అది ఎందుకు జరుపుకుంటారో కూడా సరిగా తెలియదు.
దిశ, వెబ్‌డెస్క్: భారత దేశంలో ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే ఈ కాలం పిల్లలకు అది ఎందుకు జరుపుకుంటారో కూడా సరిగా తెలియదు. భౌతిక శాస్త్రవేత్త అయిన సర్ సీవీ రామన్‌కు నోబెల్ బహుమతిని అందించిన గుర్తుగా.. అలాగే ఆయన పరిశోధన ఫలితాన్ని ధ్రువపరిచిన రోజు ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రతి సంవత్సరం ఈ రోజున జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుకుంటున్నాము.
సీవీ రామన్ వివరాలు..
సీవీ రామన్ అసలు పేరు.. చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబరు 7 వ తేదీన తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. సి.వి.రామన్ తండ్రి భౌతిక అధ్యాపకులవడం, అతనిని భౌతిక శాస్త్రం వైపు కుతూహలం పెంచుకునేలా చేసింది.
చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ (ఫిజిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించి) పూర్తి చేశాడు. 1907లో ఎం.యస్.సి (ఫిజిక్స్)లో యూనివర్సిటీకి ప్రథముడిగా నిలిచారు. తన 18వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఆయన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమైంది.