ఒక్క నెలలో 74 లక్షల అకౌంట్లపై వాట్సాప్‌ నిషేధం..

ఒక్క ఆగస్టు నెలలోనే 74 లక్షల అకౌంట్లపై వాట్సాప్‌ నిషేధం కొరడా ఝుళిపించింది.

Update: 2023-10-02 14:03 GMT

న్యూఢిల్లీ : ఒక్క ఆగస్టు నెలలోనే 74 లక్షల అకౌంట్లపై వాట్సాప్‌ నిషేధం కొరడా ఝుళిపించింది. అశ్లీల సమాచారం, నకిలీ వార్తలు, వదంతులను వ్యాప్తి చేస్తున్నాయని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందడంతో ఈ వాట్సాప్ ఖాతాలపై బ్యాన్ విధించారు. కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్న 35 లక్షల వాట్సాప్ అకౌంట్లపై ఎలాంటి ఫిర్యాదులు రాకున్నా తామే బ్యాన్ చేశామని వాట్సాప్ ప్రకటించింది.

2021 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ నిబంధనలను ఉల్లంఘించేలా పనిచేస్తున్న వాట్సాప్ అకౌంట్లను నిలువరిస్తున్నామని స్పష్టం చేసింది. బ్యాన్ చేసిన వాట్సాప్ అకౌంట్ల సంఖ్య జులై నెలతో పోల్చుకుంటే ఆగస్టులో దాదాపు 2 లక్షలు ఎక్కువగా ఉందని తెలిపింది. ఇక సెప్టెంబరు నెలలో 72.28 లక్షల వాట్సాప్ అకౌంట్లను నిషేధించారు.


Similar News