హర్యానా ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు: ప్రధాని మోడీ
పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ విజయం సాధించింది.
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ విజయం సాధించింది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు ఈ రోజు వెలువడగా.. హర్యానాలో గతంలో కంటే ఎక్కువ స్థానాలు సాధించి మూడో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయింది. అయితే ఈ ఎన్నికలపై ఎగ్జిట్ ఫోల్స్ మాత్రం భిన్నంగా అంచనా వేసినప్పటికీ.. ప్రజలు మాత్రం మరోసారి బీజేపీ ప్రభుత్వానికి పట్టం కట్టారు. కాగా హర్యానాలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరుసగా మూడోసారి బీజేపీకి పట్టగట్టారు. ఈ విజయంపై ప్రధాని మోడీ స్పందించారు. "
భారతీయ జనతా పార్టీకి మరోసారి స్పష్టమైన మెజారిటీ ఇచ్చినందుకు హర్యానా ప్రజలకు నేను నమస్కరిస్తున్నాను. ఇది అభివృద్ధి, సుపరిపాలన రాజకీయాల విజయం. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఏ రాయిని వదిలిపెట్టి బోమని నేను వారికి హామీ ఇస్తున్నాను. ఈ గొప్ప విజయం కోసం అవిశ్రాంతంగా, పూర్తి అంకితభావంతో పనిచేసిన నా సహోద్యోగులందరినీ నేను కూడా అభినందిస్తున్నాను. మీరు రాష్ట్ర ప్రజలకు బాగా సేవ చేయడమే కాకుండా మా అభివృద్ధి ఎజెండాను వారికి తెలియజేశారు. ఫలితంగా హర్యానాలో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించింది." అని సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీ తన సందేశాన్ని హర్యానా ప్రజలతో పంచుకున్నారు.