PM Modi: ప్రధాని మోడీ హత్యకు ప్లాన్.. ముంబై కంట్రోల్ రూంకి బెదిరింపు కాల్

ప్రధాని నరేంద్ర మోడీని (PM Modi) చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఓ మహిళ ముంబై పోలీసులకు ఫోన్‌ చేసి ఈ బెదిరింపులకు(threat call). పాల్పడింది.

Update: 2024-11-28 07:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీని (PM Modi) చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఓ మహిళ ముంబై పోలీసులకు ఫోన్‌ చేసి ఈ బెదిరింపులకు(threat call). పాల్పడింది. ప్రధాని హత్యకు ప్లాన్‌ చేస్తున్నట్లు పేర్కొంది. గురువారం ఉదయం ముంబై పోలీసు కంట్రోల్‌ రూమ్‌ (Mumbai Police control room)కు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ప్రధాని హత్యకు ప్లాన్‌ చేస్తున్నట్లు మహిళ ఫోన్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఫోన్‌కాల్‌ను ట్రేస్‌ చేయగా.. 34 ఏళ్ల మహిళ ఈ బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడిన మహిళను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సదరు మహిళ మానసిక పరిస్థితి బాగోలేదని పోలీసులు భావిస్తున్నారు.

గతేడాది కూడా..

గత ఏడాది జులైలో కూడా ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఇలాంటి బెదిరింపు కాల్ వచ్చింది. అందులో ప్రధాని మోడీని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని చంపేస్తామని దుండగులు హెచ్చరించారు. గుర్తుతెలియని వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌లోని ల్యాండ్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ప్రధానిని, యూపీ సీఎంను చంపేస్తానని.. దేశంలో "26/11 తరహా దాడి" చేస్తామని బెదిరించాడు.

Tags:    

Similar News