Sanjay Raut : ఎంవీఏ నుంచి ఉద్ధవ్ సేన విడిపోవట్లేదు.. ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యలు

మహారాష్ట్ర ప్రతిపక్ష కూటమిపై శివసేన(యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్(Shiv Sena (UBT) leader Sanjay Raut) కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-28 08:58 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర ప్రతిపక్ష కూటమిపై శివసేన(యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్(Shiv Sena (UBT) leader Sanjay Raut) కీలక వ్యాఖ్యలు చేశారు. మహా వికాస్ అఘాడీ(Maha Vikas Aghadi) నుంచి ఉద్ధవ్ సేన విడిపోవట్లేదన్నారు. అలా వస్తున్న వార్తలన్నీ పుకార్లే అని తోసిపుచ్చారు. "అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరైనా వదంతలు సృష్టిస్తే అది వారి వ్యక్తిగత అభిప్రాయమే. లోక్ సభ ఎన్నికల్లో మేం గెలిచినప్పుడు, ఉద్ధవ్ సేన కూటమి నుండి విడిపోతుందని ఎవరూ ఎందుకు అనలేదు" అని ప్రశ్నించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడే వచ్చాయని.. ఏం చేయాలో తమ పార్టీకి తెలుసు అని చెప్పుకొచ్చారు.

మహాయుతిపై విమర్శలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలై రోజులు గడుస్తున్నా, ఫుల్ మెజారిటీ సాధించినా ఇంకా ముఖ్యమంత్రిని ఎందుకు ఎంపిక చేయడం మహాయుతి(Mahayuti) కూటమిపై సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోడీ(Prime Minister Modi), కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Home Minister Amit Shah), ఇతర కూటమి నేతలు తమ ముఖ్యమంత్రిని ఎందుకు ఎంపిక చేయలేదని రౌత్‌ నిలదీశారు. అలానే సీఎం ఏక్‌నాథ్‌ షిండేపై కూడా సంజయ్ రౌత్‌ మండిపడ్డారు. శివసేన పేరుతో ఏక్‌నాథ్‌ షిండే(Eknath Shinde) బాలాసాహెబ్‌ పేరును రాజీకీయాలకు వాడుకుంటున్నారని, కానీ ఆయన పార్టీకి సంబంధించిన నిర్ణయాలు మాత్రం ఢిల్లీలో జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. బాలాసాహెబ్‌ పేరుతో నిర్ణయాలు జరగాల్సింది ఢిల్లీలో కాదని, ముంబైలో అని గుర్తుచేశారు. బాలాసాహెబ్‌ ఠాక్రే ఎన్నడూ బీజేపీ నేతలను కలవడం కోసం ఢిల్లీకి వెళ్లలేదని, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ లాంటి నేతలే ఆయనను కలిసేందుకు ముంబైకి వచ్చేవారని చెప్పారు. అసలైన శివసైనికులుగా తామెన్నడూ ఢిల్లీకి వెళ్లి వాళ్లను (బీజేపీ నేతలను) భిక్షమడగలేదని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News