DDOS attack: ట్రంప్- మస్క్ ఇంటర్వ్యూపై సైబర్ అటాక్?

: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఆయన మద్దతుదారులు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ చేస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది.

Update: 2024-08-13 04:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఆయన మద్దతుదారులు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ చేస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. చాలామంది వినియోగదారులకు ఈ వీడియో అందుబాటులోకి రాలేదు. అయితే, చాలామందికి ఈ ఇంటర్వ్యూ అందుబాటులో రాలేదు. దీంతో, సోషల్ మీడియా ఎక్స్ పై డీడీఓఎస్(DDOS) దాడి జరిగిందని మస్క్ పేర్కొన్నారు. "ఎక్స్ పై భారీ డీడీఓఎస్ దాడి జరిగినట్లు కనిపిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నాం. తక్కువమంది లైవ్ లిసెనర్స్ తో ఈ ఇంటర్వ్యూని కొనసాగిస్తాం. ఈ సంభాషణను తర్వాత పోస్ట్ చేస్తా" అని ఒక పోస్టులో మస్క తెలిపారు. అయితే, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫాం ఎక్స్ అకౌంట్ ని మళ్లీ ట్రంప్ వాడటంతో.. ఆయన్ని మస్క్ ఇంటర్వ్యూ చేశారు.

డీడీఓఎస్ దాడి అంటే ఏమిటి?

డీడీఓఎస్ అంటే "డిస్ట్రిబ్యూటెడ్ డినియల్-ఆఫ్-సర్వీస్ అటాక్". దీనిద్వారా సర్వర్ లేదా నెట్‌వర్క్ లపై దాడి చేస్తారు. దీంతో, ఇంటర్నెట్ ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది. తద్వారా టెక్నాలజీ సంబంధిత కార్యకలాపాలు ఆగిపోతాయి. సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఫోర్టినెట్‌ దీనిని సైబర్‌ క్రైమ్‌గా పేర్కొంది. డీడీఓఎస్ తో నిర్ధిష్ట వ్యక్తులు, సంస్థలను టార్గెట్ చేస్తారు. ఆ వ్యక్తి ఆన్‌లైన్ సేవలు, సైట్‌లను యాక్సెస్ చేయకుండా వినియోగదారులను నిరోధించడానికి ఇంటర్నెట్ ట్రాఫిక్‌తో సర్వర్‌ను నింపారు. ట్రంప్- మస్క్ ఇంటర్వ్యూలో అదే జరిగిందని ఫోర్టినెట్ పేర్కొంది.


Similar News