BJP Delhi Chief:ఆప్ పై కోపంతో యమునా నదిలో మునక.. ఆతర్వాత ఆస్పత్రిలో చేరిక

ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపేందుకు ఢిల్లీ బీజేపీ చీఫ్‌ వీరేంద్ర సచ్‌దేవ వినూత్న చర్య చేపట్టారు.

Update: 2024-10-26 11:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపేందుకు ఢిల్లీ బీజేపీ చీఫ్‌ వీరేంద్ర సచ్‌దేవ వినూత్న చర్య చేపట్టారు. కాలుష్యంతో నురగలు కక్కుతున్నయమునా నదిలో సచ్ దేవ మునక వేశారు. నదిలో మునిగిన మూడు రోజుల తర్వాత సచ్‌దేవపై యమున కాలుష్యం ఎఫెక్ట్‌ పడింది. చర్మంపై దురదలు రావడంతో పాటు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో సచ్‌దేవ శనివారం ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కాషాయపార్టీ సోషల్ మీడియాలో వెల్లడించింది.

కేజ్రీవాల్ పై విమర్శలు

యమునలో కాలుష్యం ఇంతగా పెరగడానికి ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ కారణమని బీజేపీ విమర్శించింది. కాగా, ఢిల్లీలో కాలుష్య నివారణకు కేటాయించాల్సిన నిధులను ఆప్‌ ప్రభుత్వం దారి మళ్లించిందని మండిపడ్డారు. నిరసనలో భాగంగానే సచ్‌దేవ గురువారం యమునలో మునిగారు. అయితే సచ్‌దేవ చర్యపై ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్‌ విమర్శలు గుప్పించారు. అదంతా ఒక పెద్ద డ్రామా అని కొట్టిపారేశారు.


Similar News