పాకిస్థాన్ గాజులు ధరించేలా చేస్తాం: ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ అణుశక్తికి ఇండియా కూటమి నేతలు భయపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోడీ ప్రసంగించారు.

Update: 2024-05-13 08:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ అణుశక్తికి ఇండియా కూటమి నేతలు భయపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోడీ ప్రసంగించారు. ఇండియా అలయెన్స్‌లో పాకిస్థాన్‌కు భయపడే నాయకులున్నారని తెలిపారు. ‘ఒకవేళ పాకిస్తాన్ గాజులు ధరించకపోతే, మేము వాటిని ధరించేలా చేస్తాం. ఇప్పుడు వారి వద్ద ఆహార పధార్థాలతో పాటు.. తగినన్ని గాజులు కూడా లేవని మాకు తెలుసు’ అని వ్యాఖ్యానించారు.

‘తీవ్రవాదంపై పాక్‌కు క్లీన్ చిట్ ఇచ్చి.. సర్జికల్ స్ట్రైక్స్‌పై సందేహాలు లేవనెత్తే పిరికిపందలు ప్రతిపక్షంలో ఉన్నారు. వారిని జాగ్రత్తగా గమనించాలి. వారికి సంబంధించిన వామపక్ష మిత్రులు కూడా మన అణ్వాయుధాలను కూల్చివేయాలని కోరుకుంటున్నారు’ అని తెలిపారు. కాగా, ఇటీవల నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా పాక్ గాజులు తొడ్డుక్కొని ఏం లేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ కౌంటర్ ఇచ్చారు. అంతకుముందు హాజీపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో మాట్లాడుతూ, రాజకీయ నాయకులపై దాడుల్లో ఈడీ రికవరీ చేసిన డబ్బు దేశంలోని పేదలకు సంబంధించినదని అన్నారు.

కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యలపై ప్రతిపక్షాలు నిరంతరం విమర్శిస్తున్నాయి. ఎందుకంటే గత కాంగ్రెస్ హయాంలో స్కూల్ బ్యాగ్‌లో ఉండే రూ.35 లక్షలను మాత్రమే ఈడీ స్వాధీనం చేసుకుంది. కానీ బీజేపీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రూ. 2,200 కోట్లను రికవరీ చేసింది. దీని కోసం 70 చిన్న ట్రక్కులు అవసరం ఉంటుంది’ అని చెప్పారు. అధికారంలో ఉండగా దోపిడీలు, కిడ్నాప్‌లను ప్రోత్సహించిన కాంగ్రెస్‌, ఆర్జేడీ పార్టీలు తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని చెబుతునాన్నాయి. కానీ నేను ఉన్నంత కాలం అది జరగనివ్వను అని తెలిపారు. అయోధ్యలో రామ మందిరం గురించి అభ్యంతరకరమైన ప్రకటనలు చేయడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగా ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు.

Tags:    

Similar News