Hemant Soren : గిరిజనులను ఆకలి చావుల నుండి దూరం చేస్తాం : హేమంత్ సోరెన్

ఝార్ఖండ్(Jarkhand)లో మళ్లీ తమ ప్రభుత్వం ఏర్పడితే పీడీఎస్(PDS) కింద ఇచ్చే రేషన్ మొత్తాన్ని పెంచుతామని, అలాగే పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(CM Hemanth Soren) ఆదివారం ప్రకటించారు.

Update: 2024-11-03 15:47 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఝార్ఖండ్(Jarkhand)లో మళ్లీ తమ ప్రభుత్వం ఏర్పడితే పీడీఎస్(PDS) కింద ఇచ్చే రేషన్ మొత్తాన్ని పెంచుతామని, అలాగే పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(CM Hemanth Soren) ఆదివారం ప్రకటించారు. ప్రస్తుతం 5 కిలోల రేషన్ ఉచితంగా ఇస్తుండగా, దానిని 7 కిలోలకు పెంచుతామని వెల్లడించారు. ఝార్ఖండ్‌లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు 11 లక్షల మందికి రేషన్ కార్డులు రద్దు చేశారని, దీనివల్ల చాలా మంది గిరిజనులు, దళితులు ఆకలితో చనిపోయారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఏ ఒక్కరినీ ఆకలి చావులకు గురికానివ్వమని పేర్కొన్నారు. మాయన్ సమ్మాన్ యోజన(Mayan Samman Yojana) కింద మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని, అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్నభోజనంలో పిల్లలకు గుడ్లు, పండ్లు కూడా అందజేస్తామన్నారు.

Tags:    

Similar News