పాకిస్థాన్‌తో యుద్ధం చేయక తప్పదు..కేంద్ర మంత్రి అథవాలే సంచలన వ్యాఖ్యలు

జమ్మూ కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే స్పందించారు.

Update: 2024-06-10 10:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే స్పందించారు. మోడీ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే భయాందోళనకు గురి చేయడానికి ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడిగా అభివర్ణించారు. సోమవారం ఆయన ఓ మీడియా చానల్‌తో మాట్లాడారు. కశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదం అంతమైందని, ఇలాంటి ఘటనలు మళ్లీ కొనసాగితే పాకిస్థాన్‌తో భారత్ యుద్ధం చేయక తప్పదని వ్యాఖ్యానించారు. కేవలం భయాన్ని సృష్టించడానికే ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అనేక మంది ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) ద్వారా భారత్‌లోకి ప్రవేశిస్తున్నారని, ఉగ్ర ఘటనలు పునరావృతం అయితే పీఓకేను ఆక్రమించుకోవాల్సిన అవసరం వస్తుందని స్పష్టం చేశారు. త్వరలోనే దీనిపూ మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాగా, జమ్మూ కశ్మీర్‌లోని రియాసి ప్రాంతంలో ఆదివారం జరిగిన ఉగ్రదాడిలో తొమ్మిది మంది మరణించగా, 41 మంది గాయపడిన విషయం తెలిసిందే.


Similar News