Visa: అమెరికా వీసా ఇంటర్వ్యూ కష్టాలకు చెక్ .. జనవరి 1 నుంచి కొత్త రూల్స్!
అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు యూఎస్ గుడ్ న్యూస్ చెప్పింది. వీసా ఇంటర్వ్యూ కోసం వెయిటింగ్ టైమ్ ను తగ్గించేందుకు చర్యలు తీసుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా (America) వెళ్లాలనుకునే భారతీయులకు యూఎస్ గుడ్ న్యూస్ చెప్పింది. వీసా ఇంటర్వ్యూ కోసం వెయిటింగ్ టైమ్‌ను తగ్గించేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు H-1B సహా నాన్ ఇమ్మిగ్రెంట్ (Non immigrant) వీసా అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్, రీషెడ్యూల్ చేయడానికి కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ రూల్స్ ప్రకారం.. దరఖాస్తుదారులు ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఒకసారి అపాయింట్ మెంట్‌ను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పించనుంది. అయితే రీషెడ్యూల్ చేసిన అపాయింట్‌మెంట్‌ను కోల్పోయినా, లేదా ఒకటి కంటే ఎక్కువసార్లు రీషెడ్యూల్ చేయాల్సి వచ్చినా తప్పనిసరిగా కొత్త అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసి, మళ్లీ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ రూల్స్ అమలులోకి రానున్నట్టు భారత్‌లోని యూఎస్ ఎంబసీ వెల్లడించింది. కొత్త నిబంధనలు ప్రతి ఒక్కరికీ ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ పొందడాన్ని సులభతరం చేస్తాయని తెలిపింది. దరఖాస్తుదారులందరూ షెడ్యూల్ చేసిన టైంలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించింది.