Mayawati: అమిత్ షా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి.. బీఎస్పీ చీఫ్ మాయవతి
అంబేడ్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న నేపథ్యంలో బీఎస్పీ చీఫ్ మాయవతి స్పందించారు.
దిశ, నేషనల్ బ్యూరో: అంబేడ్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith shah) చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న నేపథ్యంలో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (BSp) చీఫ్ మాయవతి(Mayawati) స్పందించారు. అమిత్ షా అంబేడ్కర్ గౌరవాన్ని దెబ్బతీశారని విమర్శించారు. తన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం ఆమె లక్నోలో మీడియాతో మాట్లాడారు. అమిత్ షాను బాబా సాహెబ్ అనుచరులు ఎప్పటికీ క్షమించరని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఆయనపై ఆగ్రహం ఉందన్నారు. ‘అంబేడ్కర్‌పై పార్లమెంటులో అమిత్ షా వాడిన మాటలు బాబా సాహెబ్ గౌరవాన్ని, అస్తిత్వాన్ని ఎంతగానో దెబ్బతీశాయి. ఈ మాటలను ఉపసంహరించుకోవాలి. ఆయన పశ్చాత్తాపపడాలి. లేకపోతే అంబేడ్కర్ అనుచరులు దీనిని ఎప్పటికీ మరచిపోలేరు’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కూడా అంబేడ్కర్‌ను పదే పదే వ్యతిరేకిస్తోందన్నారు. దళితులు కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని, ఈ విషయాన్ని అంబేడ్కరే స్వయంగా చెప్పారని సూచించారు.