Veer Savarkar: వీర్ సావర్కర్ కాలేజీకి ప్రధాని మోడీ శంకుస్థాపన.. మరో రెండు డీయూ క్యాంపస్‌లూ ప్రారంభం

ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధంగా నిర్మిస్తున్న వీర్ సావర్కర్ కాలేజీతో పాటు మరో రెండు క్యాంపస్‌లకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు.

Update: 2025-01-03 15:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ యూనివర్సిటీ(DU)కి అనుబంధంగా నిర్మిస్తున్న వీర్ సావర్కర్ కాలేజీతో పాటు మరో రెండు డీయూ క్యాంపస్‌లకు ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఢిల్లీలోని అశోక్ విహార్‌ (Ashok vihar)లో ఈ కార్యక్రమం నిర్వహించారు. రూ.600 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ విద్యా అవకాశాలు, సౌకర్యాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పలు ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను సైతం మోడీ ప్రారంభించారు. ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా తన ఉనికిని విస్తరించేందుకు డీయూ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సూరజ్మల్ విహార్‌లోని ఈస్ట్ క్యాంపస్, ద్వారకా సెక్టార్ 22లోని వెస్ట్ క్యాంపస్ ప్రస్తుతం ఉన్న నార్త్, సౌత్ క్యాంపస్‌లలో చేరనున్నాయి. ఈస్ట్ క్యాంపస్ 15.25 ఎకరాల్లో విస్తరించి రూ.373 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఇతర మల్టీడిసిప్లినరీ కోర్సులతో పాటు ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం, వంటి ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. అలాగే 107 కోట్లతో నిర్మిస్తున్న వెస్ట్ క్యాంపస్ మొదటి దశలో కొత్త అకడమిక్ బ్లాకును ఏర్పాటు చేయనుంది.

Tags:    

Similar News