UP: నదిలో పడిన వ్యక్తిని కాపాడేందుకు 10 వేలు డిమాండ్.. సొమ్ము చెల్లించేలోపు కొట్టుకుపోయిన ఆదిత్య

ఓ ప్రభుత్వ అధికారి నదిలో పుణ్యస్నానం చేస్తూ ప్రవాహానికి కొట్టుకుపోయాడు.

Update: 2024-09-02 11:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ ప్రభుత్వ అధికారి నదిలో పుణ్యస్నానం చేస్తూ ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అతన్ని కాపాడేందుకు ఈతగాడు పదివేలు డిమాండ్ చేశారు. సొమ్ము చెల్లించేలోపు ఆ అధికారి నీళ్లలో గల్లంతయ్యాడు. ఈ ఘటన రెండు క్రితం జరిగింది. ఆదిత్య వర్థన్ గౌరవ్ అనే వ్యక్తి బనారస్ లో ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. అతడు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి గంగా నదిలో పుణ్యస్నానం చేసేందుకు ఉన్నావ్ జిల్లాలోని నానామౌ ఘాట్ కు వెళ్లారు. గౌరవ్ స్నానం చేస్తుండగా.. ఒక్కసారిగా బలమైన ప్రవాహం రావడంతో నదిలో కొట్టుకుపోయాడు. మునిగిపోతున్న సమయంలో కాపాడాలని చేతులు పైకెత్తి సహాయం కోసం అర్జించాడు. ఇంతలో గౌరవ్ స్నేహితుడు ప్రదీప్ తివారీ తన స్నేహితుడిని రక్షించాలని నది పక్కనే ఉన్న బోట్ మ్యాన్ శైలేష్‌ను కోరాడు.

అయితే ఇదే అదునుగా భావించిన ఈతగాడు అతన్ని కాపాడాలంటే 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇస్తానని చెప్పినా వినకుండా.. ఆ సొమ్మును ఇప్పుడే తన అకౌంట్ కు పంపాలని తెలిపాడు. ప్రదీప్ సొమ్మును ట్రాన్స్‌ఫర్ చేసే లోపు గౌరవ్ నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయాడు. తర్వాత పడవతో నదిలోకి వెళ్లి చూసినా అతడు కనిపించలేదు. దీంతో బోట్ మ్యాన్ శైలేష్ పడవను గంగా నది తీరంలో వదిలేసి పరారయ్యాడు. నీటిలో గల్లంతైన గౌరవ్ కోసం రాష్ట్ర పోలీసులతో పాటు ఎస్‌డీఆర్ఏ, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు సహా 75 మంది అధికారులు గాలింపు చర్యలు చెపట్టాయి. అయినా ఇప్పటివరకు గౌరవ్ ఆచూకీ లభించలేదు. ప్రవాహాంలో కొట్టుకుపోయిన ఆదిత్య వర్ధన్ గౌరవ్ భార్య మహారాష్ట్రలో న్యాయమూర్తిగా పనిచేస్తుంది.


Similar News