Kolkata Police arrest: కోల్ కతాలో నిషేధిత బాణసంచా స్వాధీనం

కోల్ కతాలో నిషేధిత బాణసంచా(banned firecrackers) పేల్చిన వారిపై పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. గురువారం రోజున కోల్‌క‌తాలో కాళీ పూజ‌తో పాటు దీపావ‌ళి సంబ‌రాలు నిర్వ‌హించారు.

Update: 2024-11-01 11:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్ కతాలో నిషేధిత బాణసంచా(banned firecrackers) పేల్చిన వారిపై పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. గురువారం రోజున కోల్‌క‌తాలో కాళీ పూజ‌తో పాటు దీపావ‌ళి సంబ‌రాలు నిర్వ‌హించారు. కాగా.. పండుగలో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 601 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అలానే సుమారు 70కిలోల నిషేధిత బాణసంచాను స్వాధీనం చేసుకున్నారు. వాటితోపాటు 80 లీటర్ల మధ్యాన్ని కూడా సీజ్ చేశారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన 800 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

రోజూ తనిఖీలు

శుక్రవారం తెల్ల‌వారుజామున ఏడు గంట‌ల వ‌ర‌కే బాణాసంచా పేల్చిన 265 మంది, అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన 328 మందిని, గ్యాంబ్లింగ్ ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్న‌ట్లు కోల్‌క‌తా పోలీసులు వెల్ల‌డించారు. 296 మంది బైక‌ర్లు, 93 మంది హెల్మెట్‌లేని పిలియ‌న్ రైడ‌ర్లు, 93 మంది ర్యాష్ డ్రైవింగ్‌, 90 మంది డ్రంక‌న్ డ్రైవింగ్ కింద అరెస్టు చేశారు. ఈ రకమైన తనిఖీలు, అరెస్టులు రోజూ జరుగుతాయని పోలీసులు తెలిపారు. బుధవారం వరకు 68 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. దాదాపు, 4 వేల కిలోల నిషేధిత బాణసంచా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.


Similar News