Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో ఇద్దరు చిన్నారుల మృతి కలకలం

ఉత్తరప్రదేశ్ లో ఇద్దరు పిల్లల మృతి కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌(UP's Saharanpur) జిల్లాలో గుడికి వెళ్లిన ఇద్దరు రోడ్డు పక్కన శవాలుగా కన్పించారు.

Update: 2024-11-01 11:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ లో ఇద్దరు పిల్లల మృతి కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌(UP's Saharanpur) జిల్లాలో గుడికి వెళ్లిన ఇద్దరు రోడ్డు పక్కన శవాలుగా కన్పించారు. దేవ్‌బంద్ పరిధిలోని భయాల్‌(Bhayal) గ్రామానికి చెందిన 11 ఏళ్ల దేవ్, బంధువైన 9 ఏళ్ల మహి కలిసి గురువారం గ్రామ శివారులోని గుడికి వెళ్లారు. కాగా, ఆ ఇద్దరు పిల్లలు రాత్రి వరకు ఇంటికి తిరిగిరాలేదు. దీంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పిల్లల కోసం అన్ని చోట్ల వెతికారు. అర్ధరాత్రి వేళ రోడ్డు పక్కన పిల్లల మృతదేహాలు కనిపించాయి. దీంతో క్షుద్రపూజల కోసం తమ పిల్లలను చంపి ఉంటారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. గ్రామస్తులతో కలిసి రహదారిని దిగ్బంధించి నిరసన చేపట్టారు.

కేసు నమోదు

పిల్లల మృతి విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్ కి చేరుకున్నారు. ఘటనాస్థలిలో ఆధారాల సేకరిస్తున్నారు. ఇందుకోసం ఫోరెన్సిక్ బృందాలను రప్పించారు. పిల్లల శరీరంలోని ఎముకలు విరిగినట్లు గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో వారు మరణించి ఉంటారని పోలీసులు అనుమానించారు. చిన్నారుల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు పిల్లల మరణంపై కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.


Similar News