GST collections: అక్టోబర్ నెలలో భారీగా జీఎస్టీ వసూళ్లు..!

అక్టోబర్ నెలలో భారీగా వస్తు,సేవల పన్ను వసూళ్లు (GST collections) జరిగాయి. అక్టోబర్‌ నెలలో రూ.1.87 లక్షల కోట్లు వసూలయ్యాయి.

Update: 2024-11-01 11:58 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అక్టోబర్ నెలలో భారీగా వస్తు,సేవల పన్ను వసూళ్లు (GST collections) జరిగాయి. అక్టోబర్‌ నెలలో రూ.1.87 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇందులో సీజీఎస్టీ రూపంలో రూ.33,821 కోట్లు, ఎస్‌జీస్టీ రూపంలో రూ.41,864 కోట్లు, ఐజీఎస్టీ రూపంలో రూ.99,111 కోట్లు వచ్చాయి. మరో రూ.12,550 కోట్లు సెస్సుల రూపంలో వచ్చాయి. ఇకపోతే, గతేడాది అక్టోబర్ నెలలో రూ.1.72 లక్షల కోట్ల జీఎస్టీ వసూలయ్యింది. గతేడాదితో పోలిస్తే ఈసారి 8.9 శాతం వృద్ధి నమోదైంది. దేశీయ లావాదేవీలు 10.6 శాతం వృద్ధితో రూ.1.42 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దిగుమతులపై విధించిన పన్నులు 4 శాతం పెరిగాయి. దీంతో, దిగుమతుల ద్వారారూ.45,096 కోట్లుగా వసూలైనట్లు కేంద్రం తెలిపింది. అక్టోబర్‌ నెలలో రూ.19,306 కోట్ల రిఫండ్లు జారీ చేసినట్లు పేర్కొంది.


Similar News