అమెరికాలో జాతీయ ఉత్సవ దినంగా ఆగస్టు 15

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని (ఆగస్టు 15) "నేషనల్‌ డే ఆఫ్‌ సెలబ్రేషన్‌"గా ప్రకటించాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు శ్రీ తానేదార్‌ ప్రతినిధుల సభలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

Update: 2023-08-09 11:16 GMT

వాషింగ్టన్ : భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని (ఆగస్టు 15) "నేషనల్‌ డే ఆఫ్‌ సెలబ్రేషన్‌"గా ప్రకటించాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు శ్రీ తానేదార్‌ ప్రతినిధుల సభలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్‌ సభ్యులు బడ్డీ కార్టర్‌, బ్రాడ్‌ షర్మాన్‌ కూడా మద్దతు తెలిపారు. ఆగస్టు 15ను ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో సంబరాల రోజుగా మార్చాలని వారు కోరారు. జూన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ తీర్మానానికి బీజం పడినట్లు తెలిసింది.

అమెరికా పాలక, ప్రతిపక్షాలకు చెందిన ద్వైపాక్షిక సంఘ సభ్యులు ఈ ఏడాది భారత స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొననున్నారు. అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు)లో అధికార డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన రో ఖన్నా, ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీకి చెందిన మేకైల్‌ వాల్జ్‌ల నేతృత్వంలోని 8 మంది సభ్యుల బృందం ఢిల్లీకి వస్తోంది.


Similar News