Jagdeep Dhankhar : హిందువులపై దాడులను తలుచుకుంటే గుండె తరుక్కుపోతోంది : ఉప రాష్ట్రపతి

దిశ, నేషనల్ బ్యూరో : పొరుగు దేశాల్లో(బంగ్లాదేశ్, పాకిస్తాన్) హిందువులపై జరుగుతున్న దాడులను తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతోందని భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ అన్నారు.

Update: 2024-10-18 19:43 GMT

దిశ, నేషనల్ బ్యూరో : పొరుగు దేశాల్లో(బంగ్లాదేశ్, పాకిస్తాన్) హిందువులపై జరుగుతున్న దాడులను తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతోందని భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ అన్నారు. తమను తాము నైతికతకు మారుపేరుగా చెప్పుకునే కొందరికి.. ఈ ఉదంతాలపై నోరు పెగలకపోవడం విచిత్రంగా ఉందని ఆయన మండిపడ్డారు. హింసకు బలి అవుతున్న ఆయా దేశాల హిందువుల్లో ఒకరిగా ఉండి ఉంటే .. పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోవాలని భారత్‌లోని విపక్ష నేతలకు ఉప రాష్ట్రపతి సూచించారు. ‘‘కొన్ని దుష్టశక్తులు భారత్‌ ప్రతిష్ఠను మసకబార్చేందుకు కుట్ర పన్నాయి.

మానవ హక్కుల గురించి భారత్‌కు పాఠాలు నేర్పించాలని అవి భావిస్తున్నాయి. అలాంటి వాళ్ల అవసరం భారత్‌కు లేనే లేదు. సహనం విషయంలో భారత్‌కు ఎవరూ సాటిరారు’’ అని జగదీప్ ధన్‌ఖర్ స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ విధించిన సమయం, 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు వంటి ఘటనలు దేశ ప్రజల స్వేచ్ఛను హరించాయన్నారు.


Similar News