రైల్వే మంత్రితో... బండి సంజయ్ అత్యవసర భేటీ!
హైదరాబాద్ లోని ఉప్పల్ రైల్వే స్టేషన్(Uppal railway station) ను అప్ గ్రేడ్ చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు.
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని ఉప్పల్ రైల్వే స్టేషన్(Uppal railway station) ను అప్ గ్రేడ్ చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. ఈ సందర్భంగా ఢిల్లీలో రైల్వే మంత్రి ని స్వయంగా కలిసి, వినతి పత్రం ను అందజేశారు బండి సంజయ్.
ఈ భేటీలో.. ఉప్పల్ రైల్వే స్టేషన్ అప్ గ్రేడ్(Upgarde) లో భాగంగా రైల్వే స్టేషన్ భవనం తో పాటు, ప్లాట్ ఫామ్ ను ఆధునీకరించాలని, ప్రయాణీకుల రాకపోకలకు సంబంధించిన సౌకర్యాలను మెరుగుపర్చాలని కోరారు.అలాగే, స్టేషన్లో సోలార్ ప్యానెల్ లను విస్తరించాలని, పార్కింగ్ సౌకర్యాలను ఎక్స్ ప్యాన్షన్(Expansion) చేయాలని కోరారు. టికెట్ కౌంటర్, లగేజీ నిర్వహణ వ్యవస్థను కూడా మెరుగుపర్చాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేకూర్చే ఉప్పల్ స్టేషన్ ని త్వరగా ఆధునీకరించాలని, దానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయాలని బండి సంజయ్ రైల్వే మంత్రిని కోరారు.
దీంతో పాటు.. కరీంనగర్ నుండి హసన్ పర్తి వరకు 61.8 కిలోమీటర్ల మేర చేపట్టే కొత్త రైల్వే లైన్ కు రూ.1415 కోట్ల వ్యయం అవుతుందని, దీనికొరకు డీపీఆర్ కూడా సిద్ధం అయిందని మంత్రి తెలిపారు.అయితే ఈ అంశం రైల్వే బోర్డులో పెండింగ్ లో ఉందని, తక్షణమే ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని బండి సంజయ్ రైల్వే మంత్రిని కోరినట్లు తెలుస్తోంది.ఈ రైల్వే లైన్ పూర్తయితే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. దీంతో పాటు కరీంనగర్ నుంచి వరంగల్ మధ్య వాణిజ్య రవాణాకు సంబంధించి కనెక్టివిటీ పెరిగి ఆర్ధికాభివృద్ధికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. దీంతో పాటు జమ్మికుంట స్టేషన్ వద్ద సౌత్ ఎక్స్ ప్రెస్ రైలు ఆగేలా తక్షణమే రైల్వే అధికారులను ఆదేశించేలా చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రిని కోరారు బండి సంజయ్.