Uttar Pradesh: మోడీని, యోగిని పొగిడిందని ముస్లిం వివాహితకు ట్రిపుల్ తలాక్

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌ లో మోడీని, యోగిని ప్రశంసించినందుకు ఓ ముస్లిం వివాహితకు తన భర్త "ట్రిపుల్ తలాక్" చెప్పాడు.

Update: 2024-08-24 07:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌ లో మోడీని, యోగిని ప్రశంసించినందుకు ఓ ముస్లిం వివాహితకు తన భర్త "ట్రిపుల్ తలాక్" చెప్పాడు. మహిళ ఫిర్యాదు మేరకు ఆమె భర్త, కుటుంబసభ్యులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయోధ్య అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ప్రశంసించినందుకే తనకు విడాకులు ఇచ్చారని మహిళ ఆరోపించారు. తన అత్త, భర్త తనను తీవ్రంగా కొట్టారని ఫిర్యాదులో పేర్కొంది. తనను గొంతు కోసి చంపేందుకు ప్రయత్నించేందుకు తన కుటుంబసభ్యులు యత్నించారని వెల్లడించింది. మహిళ మాట్లాడుతూ.. “పెళ్లయిన తర్వాత సిటీకి వెళ్లినప్పుడు అయోధ్య ధామ్‌లోని రోడ్లు, సుందరీకరణ, అభివృద్ధి, అక్కడి వాతావరణం నాకు బాగా నచ్చాయి. దీనిపై నా భర్త ముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించాను. దీంతో నన్ను నా ఇంటికి పంపించాడు. నాపై పాన్ ని కు కూడా ఉమ్మాడు. ఆ తర్వాత బంధువుల జోక్యంతో మళ్లీ వెళ్లాను. కానీ, మళ్లీ గొడవ జరిగింది. నాపై దాడి చేశాడు' అని చెప్పింది.

కేసు నమోదు

పెళ్లయిన కొన్నిరోజులకే మహిళను పుట్టింటికి పంపాడని.. కొంత సమయం గడిచాక బంధువుల జోక్యంతో ఆమెను తన భర్త దగ్గరికి వెళ్లిందని జర్వాల్ రోడ్ పోలీసులు తెలిపారు. విడాకులు ఇచ్చిన రోజే తన భర్త తనను కొట్టాడని ఆమె ఫిర్యాదు చేసిందన్నారు. ఫిర్యాదు ఆధారంగా ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. దాడి, బెదిరింపులు, వరకట్న నిషేధ చట్టం, ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


Similar News