UP Government: ఉద్యోగులకు యూపీ ప్రభుత్వం డెడ్ లైన్.. కారణమిదే?

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను సమర్పించేందుకు ఉత్తరప్రదేశ్ సర్కార్ మరో నెల గడువు ఇచ్చింది.

Update: 2024-09-03 13:58 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను సమర్పించేందుకు ఉత్తరప్రదేశ్ సర్కార్ మరో నెల గడువు ఇచ్చింది. అక్టోబర్ 2వరకు ఉద్యోగులందరూ తమ ఆస్తి డీటెయిల్స్ ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులందరూ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తమ స్థిర, చరాస్తుల వివరాలను డిపార్ట్‌మెంటల్ ఎవాల్యుయేషన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని గతంలో ప్రభుత్వం ఆర్డర్స్ జారీ చేసింది. అయితే ఆ గడువు ఆగస్టు 31 వరకు ముగిసింది. కానీ ఇప్పటి వరకు కేవలం 74 శాతం మంది ఉద్యోగులు తమ వివరాలను అందజేశారని అధికారులు తెలిపారు. దీంతో ఉద్యోగులకు మరో నెల రోజుల పాటు సమయం ఇచ్చింది.

అంతకుముందు ఆస్తుల వివరాలు సమర్పించని ఉద్యోగుల వేతనాలు ఆపాలని ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. వివరాలు వెల్లడించాకే శాలరీస్ రిలీజ్ చేయాలని తెలిపింది. అయితే ఆస్తుల వివరాలను సమర్పించేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరుతూ పలువురు ఉద్యోగులు లేఖ రాయగా ప్రభుత్వం ఈ నిర్ణయంపై యూటర్న్ తీసుకుని మరో నెలరోజుల పాటు గడువు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉద్యోగి వివరాలను నమోదు చేయకపోతే, వారు గైర్హాజరుగా గుర్తించబడతారని ప్రభుత్వం తాజాగా తెలిపింది.


Similar News