ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో జయప్రదను నిర్దోషిగా ప్రకటించిన యూపీ కోర్టు

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆజం ఖాన్‌పై చేసిన వ్యాఖ్యలతో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినట్టు ఆమెపై కేసు నమోదైంది.

Update: 2024-07-11 16:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో మాజీ ఎంపీ, నటి జయప్రదను ఉత్తరప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు గురువారం నిర్దోషిగా ప్రకటించింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో రాంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేయగా, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ చేతిలో ఓడిపోయారు. అయితే, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆజం ఖాన్‌పై చేసిన వ్యాఖ్యలతో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినట్టు ఆమెపై కేసు నమోదైంది. దీనిపై విచారణ అనంతరం ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు జయప్రదను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. తీర్పు వెలువడే సమయంలో జయప్రద కోర్టుకు హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లడుతూ.. ఈ కేసులో నన్ను నిర్దోషిగా విడుదల చేసినందుకు న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తానెప్పుడూ తప్పుగా వ్యాఖ్యలు చేయలేదు. సత్యమేవ జయతే' అన్నారు.


Similar News