UK University : భారత్‌లో యూకే యూనివర్సిటీ తొలి క్యాంపస్.. ఎక్కడో తెలుసా ?

దిశ, నేషనల్ బ్యూరో : భారత్‌లో పూర్తిస్థాయి క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్న తొలి యూకే యూనివర్సిటీగా యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ నిలువనుంది.

Update: 2024-08-29 18:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో : భారత్‌లో పూర్తిస్థాయి క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్న తొలి యూకే యూనివర్సిటీగా యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ నిలువనుంది. ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఈ క్యాంపస్ ఏర్పాటు కానుంది. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ ప్రతినిధి, ప్రొఫెసర్ ఆండ్రూ అథార్టన్‌కు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఛైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను అందజేశారు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కూడా ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.

నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ -2020 అమలులో భాగంగానే దేశంలోకి ప్రఖ్యాత విదేశీ విద్యాసంస్థలను స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రపంచ విద్యారంగ హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని జైశంకర్ చెప్పారు. 


Similar News