గుడ్ న్యూస్: పీహెచ్‌డీ‌పై UGC కీలక నిర్ణయం.. ఇకపై వారు కూడా అర్హులే..!

యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) చైర్మన్ జగదీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు.

Update: 2022-12-14 15:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) చైర్మన్ జగదీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఇకపై పీహెచ్‌డీ‌లో అడ్మిషన్ కోసం మాస్టర్ డిగ్రీ అవసరం లేదని తెలిపారు. నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా పీహెచ్‌డీకి అర్హులు అని ఆయన ప్రకటించారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సు పూర్తిచేశాక పీజీ ఒకటో సంవత్సరం విద్యార్థులు గానీ, రెండో సంవత్సరం విద్యార్థులు గానీ కూడా పీహెచ్‌డీలో చేరేందుకు అర్హులవుతారని వెల్లడించారు.

కాగా, ఇప్పటి వరకు పీహెచ్‌డీ‌లో అడ్మిషన్ పొందాలంటే పీజీ పూర్తి చేసిన వారే అర్హులు. తాజాగా యూజీసీ నిబంధనలు సవరించడంతో పీజీ పూర్తి చేయకున్న.. నాలుగేళ్ల డిగ్రీ కంప్లీట్ చేసిన వారు కూడా పీహెచ్‌డీ‌లో అడ్మిషన్ పొందేందుకు అర్హులు అవుతారు.


Similar News