Udhayanidhi Stalin: త్వరలోనే ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవి..హింట్ ఇచ్చిన సీఎం స్టాలిన్..!

దేశంలోనే తమిళనాడు(Tamilanadu) రాజకీయాలది ప్రత్యేక స్థానం.

Update: 2024-09-24 23:31 GMT

దిశ, వెబ్‌డెస్క్:దేశంలోనే తమిళనాడు(Tamilanadu) రాజకీయాలది ప్రత్యేక స్థానం.ఇక్కడ ఉన్నంత ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ మరే రాష్ట్రంలో ఉండవు.ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా సీఎం ఎంకే స్టాలిన్(CM MK Stalin) కుమారుడు ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) తమిళనాడు డిప్యూటీ సీఎం(Dy.CM)కాబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ విషయంపై సీఎం స్టాలిన్ మంగళవారం మీడియా సమావేశంలో విలేకరుల అడిగిన ప్రశ్నలకు పరోక్షంగా స్పందించారు. త్వరలోనే మంత్రివర్గ పునర్​వ్యవస్థీకరణ ఉంటుందని వ్యాఖ్యానించారు. ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవి గురించి రాష్ట్రవ్యాప్తంగా చాలాకాలంగా చర్చ జరుగుతోందని, ఈ విషయంలో నిరాశపడాల్సిన అవసరం లేదన,కచ్చితంగా మార్పు ఉంటుందని స్టాలిన్ అన్నారు. తాజాగా సీఎం స్టాలిన్ వ్యాఖ్యలతో ఉదయనిధికి ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి.

కాగా కొన్ని రోజుల క్రితం ఆ రాష్ట్ర మంత్రి త‌మో అన్బ‌ర‌స‌న్ (Thamo Anbarasan) కాంచీపురం(Kanchipuram)లో విలేకరుల సమావేశంలో మాట్లాడూతూ..ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంపై సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు.వారం నుంచి 10 రోజుల్లోగా ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా ప్రభుత్వం ప్రకటిస్తుందని అన్నారు. ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం క్రీడలు మరియు యువజన సంక్షేమ శాఖ(Youth Welfare and Sports) మంత్రిగా కొనసాగుతున్నారు.అయితే ఇటీవల వస్తున్న  డిప్యూటీ సీఎం వార్తలపై ఉధయనిధి గతవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నట్లుగా వచ్చిన వార్తలను ఆయన కొట్టిపడేశారు.డిప్యూటీ సీఎం పదవి పూర్తిగా ముఖ్యమంత్రి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు.   


Similar News