IIM Sambalpur: ఏఐ టీచింగ్‌ను ప్రారంభించిన ఐఐఎం సంబల్‌పూర్

ఏఐ క్లాస్‌రూమ్ టీచింగ్ అనేది డిజిటల్ ప్లాట్‌ఫారమ్. దీనికోసం అమెరికాకు చెందిన ఓ కంపెనీ ఒప్పందం చేసుకున్నట్టు పేర్కొంది.

Update: 2024-09-24 18:45 GMT
IIM Sambalpur: ఏఐ టీచింగ్‌ను ప్రారంభించిన ఐఐఎం సంబల్‌పూర్
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోనే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) బోధనను అమలు చేసిన మొట్టమొదటి విద్యా సంస్థగా ఐఐఎం సంబల్‌పూర్ అవతరించింది. ఏఐ క్లాస్‌రూమ్ టీచింగ్ అనేది డిజిటల్ ప్లాట్‌ఫారమ్. దీనికోసం ఐఐఎం సంబల్‌పూర్‌ అమెరికాకు చెందిన ఓ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్టు పేర్కొంది. ఐఐఎం, సంబల్‌పూర్ అధికారులు సోమవారం 10వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో.. 'ఫ్యాకల్టీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ప్రవేశపెడుతున్నాం. కొత్త పద్దతిలో టీచింగ్ కోసం క్లాస్‌రూమ్స్‌లో ఏఐని తీసుకొస్తున్నామని' సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ మహదేవ్ జైస్వాల్ అన్నారు. 2015లో కేవలం 49 మంది ఎంబీఏ విద్యార్థులతో ప్రారంభమైన ఐఐఎం సంబల్‌పూర్, ఈరోజు 320 మందితో కొనసాగడం గర్వంగా ఉంది. విద్యార్థుల కోసం కొత్త టెక్నాలజీ ఉపయోగించి సరికొత్త టీచింగ్ పద్దతిని అందించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఏఐ ఆధారిత టీచింగ్ ద్వారా విద్యార్థులు క్లాస్ రూమ్స్‌లో నేర్చుకునే విధానాన్ని మారుస్తుందని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

Tags:    

Similar News