ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యలు హాస్యాస్పదం: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బీజేపీని వీడి వస్తే మహావికాస్ అఘాఢీ తరఫున పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలపై గడ్కరీ స్పందించారు.

Update: 2024-03-13 08:59 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బీజేపీని వీడి వస్తే మహావికాస్ అఘాఢీ తరఫున పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలపై గడ్కరీ స్పందించారు. ఉద్ధవ్ వ్యాఖ్యలు హాస్యాస్పందంగా ఉన్నాయని, అంతేగాక ఆయన ప్రతిపాదనలో పరిపక్వత లేదని అన్నారు. బీజేపీలో అభ్యర్థులకు టికెట్లు ఇచ్చేందుకు ఓ విధానం ఉందని స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల కోసం మహారాష్ట్రలో టికెట్ల పంపిణీపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని చెప్పారు. బీజేపీ నేతల గురించి ఉద్ధవ్ థాక్రే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.

కాగా, ఇటీవల బీజేపీ ప్రకటించిన తొలి విడత అభ్యర్థుల జాబితాలో నితిన్ గడ్కరీ పేరు చేర్చలేదు. దీంతో రాజకీయాల్లో మంచి పేరున్న గడ్కరీకి టికెట్ రాకపోవడంతో ఉద్ధవ్ స్పందించారు. ఢిల్లీ ముందు తలవంచడం గడ్కరీకి అవమానంగా అనిపిస్తే బీజేపీకి రాజీనామా చేయండి. మహా వికాస్ అఘాడీ తరఫున ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తాం’ అని చెప్పారు. ప్రభుత్వం రాగానే మంత్రి పదవి సైతం ఇస్తామని ఆఫర్ చేశారు. దీనిపై తాజాగా గడ్కరీ స్పందించారు. మరోవైపు ఉద్ధవ్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం స్పందించారు. వీధిలో ఉన్న వ్యక్తి అమెరికా అధ్యక్షుడిని చేయడానికి ఆఫర్ ఇచ్చినట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఈ నెల ప్రారంభంలోనే లోక్‌సభ ఎన్నికలకు 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది.

Tags:    

Similar News