FBI director: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కశ్యప్ పటేల్
అమెరికాలో భారత సంతతికి చెందిన మరో వ్యక్తికి కీలక పదవి దక్కింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ యంత్రాంగాన్ని రెడీ చేసుకుంటున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో భారత సంతతికి చెందిన మరో వ్యక్తికి కీలక పదవి దక్కింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ యంత్రాంగాన్ని రెడీ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే భారత సంతతికి చెందిన కశ్యప్ పటేల్(కాష్ పటేల్) కు ముఖ్య బాధ్యతలు అప్పగించారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(FBI) డైరెక్టర్ గా ఆయన్ని నియమించనున్నట్లు ప్రకటించారు. ‘‘కాష్ గొప్ప న్యాయవాది.. పరిశోధకుడు. అమెరికాలో అవినీతి నిర్మూలనకు, న్యాయాన్ని గెలిపించేందుకే ప్రతిక్షణం పోరాడుతున్నారు. అమెరికా ప్రజలకు అండగా నిలిచారు. ఆయన నియామకంతో ఎఫ్‌బీఐకి గత వైభవాన్ని తీసుకొస్తాం’’అని ట్రంప్ పేర్కొన్నారు.
కశ్యప్ పటేల్ ఎవరంటే?
ఇకపోతే, ట్రంప్‌కు వీరవిధేయుడిగా క్యాష్‌కు పేరుంది. కశ్యప్ గుజరాత్ మూలాలున్న వ్యక్తి. అతడి తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. అతడి తండ్రి, యుగాండలో నియంత ఈదీ ఆమిన్ బెదిరింపుల కారణంగా అమెరికాకు వలస వచ్చారు. న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీ 1980లో కశ్యప్ పుట్టాడు. యూనివర్సిటీ ఆఫ్ రిచ్‌మాండ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత లా సంస్థలో పని చేయాలనుకున్నా ఉద్యోగం దొరకలేదు. దీంతో, అతడు మియామీ కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్‌గా పనిచేసి వివిధ హోదాల్లో సేవలందించారు.