వందేభారత్‌ రైలుపై చెట్టు కొమ్మలు.. మూడుగంటలు నిలిచిపోయిన ట్రైన్

ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఒడిశాలో ప్రారంభించిన వందే భారత్ రైలుపై చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి.

Update: 2023-05-22 08:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఒడిశాలో ప్రారంభించిన వందే భారత్ రైలుపై చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో రైలు దాదాపు మూడు గంటలపాటు నిలిచిపోయింది. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకున్నది. ఇటీవల ప్రధాని మోడీ.. ఒడిశా రాష్ట్రంలోని జైపూర్‌లో ప్రధాని వందే భారత్ రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలతో ఈ రైలుపై చెట్లు కూలిపడ్డాయి.

దీంతో రైలు అక్కడే నిలిచిపోయింది. పూరీ నుంచి హౌరా వెళుతున్న వందేభారత్​ ఎక్స్​ప్రెస్‌కు ఈ ప్రమాదం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గురువారమే దీన్ని అధికారికంగా ప్రారభించడం గమనార్హం. ఒడిశాలోని జైపుర్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. దీంతో ఇవాళ వందేభారత్​ఎక్స్​ప్రెస్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Read More:   నార్కో పరీక్షకు వారు సిద్దంగా ఉంటే నేను కూడా సిద్దమే: డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ 

Tags:    

Similar News