ట్రైనీ ఐఏఎస్ అత్యుత్సాహం!.. విధుల నుంచి బదీలీ

పూణేలో ట్రైనీ ఐఏఎస్ అధికారిణి అత్యుత్సాహం ఆమెను విధుల నుండి వేరే చోటుకి బదీలీ అయ్యేలా చేసింది.

Update: 2024-07-10 12:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పూణేలో ట్రైనీ ఐఏఎస్ అధికారిణి అత్యుత్సాహం ఆమెను విధుల నుండి వేరే చోటుకి బదీలీ అయ్యేలా చేసింది. యూపీఎస్సీ పరీక్షలో ఆల్ ఇండియా 821 ర్యాంకు సాధించిన పూజ ఖేద్కర్ పూణేలో అసిస్టెంట్ కలెక్టర్ గా నియమితులయ్యారు. ప్రోబేషన్ లో ఉన్న ఆమె తన అధికారాలను ఉల్లంఘించిందని ఆరోపణలతో వాషిమ్ ప్రాంతానికి బదిలీ చేయబడ్డారు. అసిస్టెంట్ కలెక్టర్ గా ఉన్న ఆమె తనకు ఇవ్వని అధికారాలను వినియోగించుకోవాలని ప్రయత్నించడంతో వివాదంలో చిక్కుకున్నారు. ప్రొబేషన్ కాలం పూర్తి కానీ ఆమె.. తన సొంత ఆడీ కారుపై రెడ్, బ్లూ సిగ్నల్ లైట్లను ఉపయోగించడం, కారుపై మహారాష్ట్ర గవర్నమెంట్ అని రాసుకోవడం లాంటివి చేసింది.

అంతేగాక అదనపు కలెక్టర్ అజయ్ మోర్ విధుల్లో లేని సమయంలో ఆయన చాంబర్ లోకి వెళ్లడం, అక్కడ ఉన్న ఫర్నీచర్ ను తొలగించడం లాంటి పనులు చేసిందని అధికారులు గుర్తించారు. అలాగే తన పేరుపై లెటర్ హెడ్, నేమ్ ప్లేట్ తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని రెవెన్యూ అసిస్టెంట్ ను కోరిందని తెలిసింది. ఇక రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా ఉన్న తండ్రి సైతం ఆమె కోరిన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ కార్యాలయంపై ఒత్తిడి తెచ్చినట్టు నివేదికలు వచ్చాయి. ఈ ఉల్లంఘనలు తన దృష్టికి రావడంతో పూణే కలెక్టర్ సుహాస్ దివాసే మహారాష్ట్ర స్టేట్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. ఈ ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం ఆమెను వాషిమ్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పూజా ఖేద్కర్ తన మిగిలి ఉన్న ప్రొబేషన్ కాలాన్ని వాషిమ్ జిల్లాలో సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్ గా పూర్తి చేయనున్నారు.


Similar News