Ayodhya Ram Temple : అయోధ్య రామమందిరంలో నేడు తొలి దీపావళి.. 500 ఏళ్ళ తర్వాత మళ్ళీ వేడుక

అయోధ్య(Ayodhya)లో నూతనంగా నిర్మించిన బాల రాముడి మందిరం(Newly built Bala Ram temple) లో తొలి దీపావళి(First Diwali)వేడుకలు నేడు వైభవంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ భారీ ఏర్పాట్లు చేసింది.

Update: 2024-10-30 07:00 GMT

దిశ, వెబ్ డెస్క్ : అయోధ్య(Ayodhya)లో నూతనంగా నిర్మించిన బాల రాముడి మందిరం(Newly built Bala Ram temple) లో తొలి దీపావళి(First Diwali)వేడుకలు నేడు వైభవంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ భారీ ఏర్పాట్లు చేసింది. జనవరి 22 న అయోధ్య ఆలయంలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించిన అనంతరం వచ్చిన తొలి దీపావళి కావడంతో వేడుకలకు ట్రస్టుతో పాటు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నాహాలు చేశాయి. రామమందిరంతో పాటు పరిసర ప్రాంతాలను దీపాలతో అలంకరించారు. ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. ఇక 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో జరగబోతున్న దీపావళి(celebration again after 500 years) వేడుకలు చరిత్రాత్మకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇవి రామ్‌లల్లా తన సొంతింటికి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి దీపావళి వేడుకలు అని.. వీటి కోసం ఎన్నో తరాలు వేచి చూసినట్లు తెలిపారు. అయోధ్య రాముడి సన్నిధిలో దీపావళి వేడుకులు కళ్లారా చూడాలని ప్రజలు తరతరాలుగా ప్రజలు వేచి చూశారని.. కానీ వాళ్ల ఆశలు నెరవేరలేదని వెల్లడించారు. కానీ ప్రస్తుత తరం ఎంతో అదృష్టం చేసుకుందని.. రామ్‌లల్లా తన జన్మస్థలానికి చేరుకున్న వేళ.. మనమంతా ఘనంగా దీపావళి వేడుకలను నిర్వహించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు దీపాల పండుగ మొదలుకొని పుష్పక విమానంలో స్వామి వచ్చేంత వరకు అనేక కార్యక్రమాలు జరుగనున్నాయి. అయోధ్య నగరంలోని వీధులు, కూడళ్ల నుంచి సరయూ నది ఘాట్ల వరకు కూడా విద్యుత్తు లైట్లతో నగరం దేదీప్యమానంగా వెలిగిపోతుంది.

28లక్షల దీపోత్సవంతో సరికొత్త గిన్నిస్ రికార్డుకు సన్నాహం(Preparing for a new Guinness record)

నేడు సరయూ నది ఒడ్డున 25 నుండి 28 లక్షల దీపాలను వెలిగించడం ద్వారా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఘాట్ నంబర్ 10లో 80,000 దీపాలతో స్వస్తిక్ ఆకారంలో అలంకరించడం ఆకట్టుకుంటుంది. అయితే ప్రత్యేక పర్యావరణ అనుకూలమైన దీపాలు రామాలయంలో వెలిగించనున్నారు. ఈ దీపాలు ఆలయ నిర్మాణాన్ని ప్రభావితం చేయకుండా మరకలు, మసిని నిరోధించడానికి రూపొందించబడటంతో పాటు ఎక్కువ సమయం వెలుగుతాయి. ఈ దీపోత్సవ్‌లో పర్యావరణ పరిరక్షణ కూడా కీలకమని ప్రభుత్వం పేర్కొంది. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి,ఆలయాన్ని మసి దెబ్బతినకుండా రక్షించడానికి ప్రత్యేక మైనపు దీపాలను ఉపయోగిస్తారని తెలిపింది. బాలరాముడి మందిరం అలంకరణలో చైనా వస్తువులను వాడకూడదని నిర్ణయించింది. స్థానికంగా తయారు చేసిన హస్తకళలకు ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రస్ట్ వర్గాలు పేర్కొన్నాయి. పర్యావరణానికి హాని కలగకుండా అయోధ్యలో బాణాసంచా 120 నుంచి 600 అడుగుల ఎత్తులో ఆకాశంలో వెలిగిస్తారు. ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు ఈ దృశ్యాన్ని సులభంగా చూడగలుగుతారు. సాయంత్రం సరయూ బ్రిడ్జి వద్ద బాణసంచా కాల్చడమే కాకుండా లేజర్ షో, ఫ్లేమ్ షో, మ్యూజికల్ కంపానిమెంట్ కూడా ప్రదర్శించనున్నారు. రామకథా పార్కు సమీపంలోని హెలిప్యాడ్ వద్ద భారత్ మిలావ్ కార్యక్రమం జరగనుంది. రాముడు, సీత, లక్ష్మణుడు పుష్పక విమానం ద్వారా ఇక్కడికి వస్తారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలుకుతారు. రామకథా పార్కులో శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో సరయూ నది ఒడ్డున 1,100 మంది ప్రత్యేక 'ఆరతి' నిర్వహించనున్నారు. గతేడాది వెలిగించిన 25 లక్షల గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టేందుకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఏర్పాట్లు  చేసింది. 

Tags:    

Similar News