ఆ ఇద్దరు నా బట్టలు విప్పి లైంగికంగా వేధించారు.. మహిళా కలెక్టర్ షాకింగ్ కామెంట్స్

‘నన్ను లైంగికంగా వేధించారు.. వారిని ఇప్పటికీ మర్చిపోలేను’ అంటూ కేరళ పతనంతిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్. అయ్యార్ తనకు

Update: 2023-03-29 12:40 GMT

వెబ్‌డెస్క్ : ‘నన్ను లైంగికంగా వేధించారు.. వారిని ఇప్పటికీ మర్చిపోలేను’ అంటూ కేరళ పతనంతిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్. అయ్యార్ తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా వెల్లడించారు. రాష్ట్ర యువజన సంక్షేమ మండలి నిర్వహించిన ఓ సమావేశంలో ఆమె ఈ విషయాన్ని తెలియజేశారు. ఆరేళ్ల వయసులో ఇద్దరు వ్యక్తులు దగ్గరకు పిలిచి బట్టలు విప్పారని.. భయపడి అక్కడ నుండి పారిపోయా అని తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించారు. అయితే ఆ సమయంలో తల్లిదండ్రులు తనకు అండగా నిలిచారని చెప్పారు. తనతో అలా ప్రవర్తించిన వ్యక్తులు ముఖాలు ఇప్పటికీ తనకు గుర్తున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనంలోనే గుడ్ టచ్, బాడ్ టచ్ మధ్య తేడా తెలియ చేయాలని కోరారు.

Tags:    

Similar News