రాజ్యాంగంపై విశ్వాసం లేని వాళ్ళే యూసీసీని వ్యతిరేకిస్తున్నారు : కేరళ గవర్నర్

యూనిఫాం సివిల్ కోడ్‌‌కు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మద్దతు ప్రకటించారు.

Update: 2023-07-03 12:49 GMT

తిరువనంతపురం : యూనిఫాం సివిల్ కోడ్‌‌కు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మద్దతు ప్రకటించారు. వివాహం, విడాకులు, వారసత్వం, ఇతర వ్యక్తిగత విషయాలలో మతంతో సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరికీ వర్తించే ఉమ్మడి నిబంధనలతో యూసీసీ ఉంటుందన్నారు. రాజ్యాంగంపై విశ్వాసం లేని వాళ్ళే యూసీసీని వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. "యూసీసీ లక్ష్యం.. న్యాయం యొక్క ఏకరూపతను సాధించడమే తప్ప.. ఆచారాల ఏకరూపతను సృష్టించడం కాదు" అని ఆయన స్పష్టం చేశారు.

"ఇస్లాం ఆచరణలో ముస్లిం పర్సనల్ లా ఒకవేళ అంతర్భాగంగా ఉండి ఉంటే.. అలాంటి వ్యక్తిగత చట్టాలను అనుమతించని అమెరికా, ఐరోపా దేశాల్లో ముస్లింలు నివసించడానికి వ్యతిరేకంగా ఫత్వా ఎందుకు ఇవ్వలేదు" అని గవర్నర్ ఆరిఫ్ ప్రశ్నించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీని పాలించిన ముస్లిం రాజులు కూడా ముస్లిం చట్టాన్ని రూపొందించలేదని ఆయన అన్నారు.


Similar News