ఈ సారి కాన్పూర్ వంతు..10 పాఠశాలలకు బాంబు బెదిరింపులు
దేశంలోని ప్రముఖ నగరాల్లో ఉన్న పాఠశాలలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. ఢిల్లీ, లక్నో, జైపూర్ తర్వాత బుధవారం ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చినట్టు పోలీసులు తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని ప్రముఖ నగరాల్లో ఉన్న పాఠశాలలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. ఢిల్లీ, లక్నో, జైపూర్ తర్వాత బుధవారం ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. సుమారు 10స్కూళ్లను పేల్చేస్తామని హెచ్చరికలు వచ్చినట్టు వెల్లడించారు. పాఠశాలల ప్రిన్సిపల్స్‌కు ఈ మెయిల్ ద్వారా సమాచారం రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌తో పాఠశాలలను తనిఖీ చేశారు. అయితే ఎటువంటి అనుమానిత వస్తువులను కనుగొనలేదు. ఈ మెయిల్‌ను పంపడానికి నిందితులు రష్యన్ సర్వర్‌లను ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. బర్రాలోని కేడీఎం స్కూల్, నౌబస్తాలోని గుల్మోహర్ స్కూల్, నజీరాబాద్‌లోని సనాతన్ ధరమ్ మందిర్ స్కూల్ సహా 10 పాఠశాలలకు వార్నింగ్స్ వచ్చాయి. కాగా, గత రెండు వారాలుగా అనేక స్కూళ్లకు బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. వీటిపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు.