Sanjay Raut: సుప్రీంకోర్టు మాజీ సీజేఐపై సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే శివసేన(యూబీటీ) దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. కాగా.. ఎన్నికల ఫలితాలపై రాజ్యసభ ఎంపీ, ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన సంజయ్ రౌత్(Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-24 11:01 GMT
Sanjay Raut: సుప్రీంకోర్టు మాజీ సీజేఐపై సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే శివసేన(యూబీటీ) దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. కాగా.. ఎన్నికల ఫలితాలపై రాజ్యసభ ఎంపీ, ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన సంజయ్ రౌత్(Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటమికి కారణాలు వెతుక్కుంటూ ఈ వీఎంలపై ఆరోపణలు చేసిన సంజయ్ రౌత్ ఈసారి సుప్రీంకోర్టు(Supreme Court) మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కారణమంటూ విమర్శలు చేశారు. ‘‘ అతను (చంద్రచూడ్) ఫిరాయింపుదారుల నుంచి చట్టం అంటే భయాన్ని తొలగించారు. ఆయన తన పేరుని నల్ల అక్షరాలతో లిఖించుకున్నారు’’ అని అన్నారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా, ఫిరాయింపుదారులకు తలుపులు, కిటికీలు తెరిచి ఉంచారని విమర్శలు చేశారు.

ఎంవీఏ ఘోర ఓటమి

ఇకపోతే, మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ(MVA) కూటమి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. మొత్తం 288 స్థానాలకుగానూ 234 సీట్లను మహాయుతి గెలుచుకుంది. ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ (MVA) 48 సీట్లకే పరిమితమైంది. కూటమిలో భాగంగా 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ కేవలం 16 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఉద్ధవ్ సేన వర్గం 95 సీట్లలో పోటీ చేస్తే కేవలం 20 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఇలాంటి ఫలితాలను తాము ఊహించలేదని ఇప్పటికే ఉద్ధవ్ థాక్రే నిరాశను వ్యక్తం చేశారు.

Tags:    

Similar News