Hemant Soren: నవంబర్ 26న జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం
జార్ఖండ్(Jharkhand) అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. సీఎం హేమంత్ సోరెన్(Jharkhand Chief Minister) నేతృత్వంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది.
దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్(Jharkhand) అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. సీఎం హేమంత్ సోరెన్(Jharkhand Chief Minister) నేతృత్వంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది. మరోసారి జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్(Hemant Soren) ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. నవంబర్ 26న సీఎంగా హేమంత్ ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, వామపక్షాల తరఫున దీపాంకర్ భట్టాచార్య తదితరులు పాల్గొంటారు.
56 స్థానాలతో భారీ విజయం
ఇక, 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నేతృత్వంలోని ఇండియా కూటమి 56 స్థానాలతో భారీ విజయాన్ని నమోదు చేసింది. భారతీయ జనతా పార్టీ (BJP) – నేతృత్వంలోని ఎన్డీఏ(NDA) కేవలం 24 సీట్లకే పరిమితం అయ్యింది. జార్ఖండ్ అసెంబ్లీలో మెజారిటీ కోసం 41 సీట్లు అవసరం. బీజేపీ 21 సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా.. జేఎంఎం 43 స్థానాల్లో పోటీ చేసి 34 గెలుచుకుంది. ఇది ఇప్పటివరకు ఆ పార్టీ గెలుచుకున్న అత్యధిక స్థానాలు ఇవే. కాంగ్రెస్‌కు 16, ఆర్జేడీ నాలుగు, సీపీఐ (ఎంఎల్) రెండు స్థానాల్లో విజయం సాధించాయి.