ఆప్, కాంగ్రెస్ మధ్య శాశ్వత పొత్తు ఉండదు: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్, కాంగ్రెస్ మధ్య శాశ్వత పొత్తు ఉండబోదని తెలిపారు.

Update: 2024-05-29 10:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్, కాంగ్రెస్ మధ్య శాశ్వత పొత్తు ఉండబోదని తెలిపారు. బుధవారం ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అధికార బీజేపీ ఓడించడమే తమ ముందున్న లక్ష్యమని తెలిపారు. నియంతృత్వ పాలనను అంతం చేయడానికే పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. ‘దేశాన్ని రక్షించడం ముఖ్యం. ఉమ్మడి అభ్యర్థిని పెట్టి బీజేపీని ఓడించేందుకు మాత్రమే ఆప్, కాంగ్రెస్‌లు ఒక్కటయ్యాయి. పంజాబ్‌లో బీజేపీకి ఉనికి లేదు’ అని చెప్పారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. బీజేపీని గద్దె దించేందుకు ప్రజలు కూడా ఒక్కటయ్యారని వెల్లడించారు. ‘నేను తిరిగి జైలుకు వెళ్లడం సమస్య కాదు. ఈ దేశ భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. వారు కోరుకున్నంత కాలం నన్ను జైలులో పెట్టనివ్వండి, నేను దేనికీ భయపడను’ అని చెప్పాడు. కాగా, ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆప్, కాంగ్రెస్ పార్టీలు పంజాబ్ లో వేర్వేరుగా అభ్యర్థులను నిలబెట్టాయి. ఇతర రాష్ట్రాల్లో సీట్ షేరింగ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.


Similar News